శ్రీ ప్రస్థానం – Sree Prasthanam : కడప సిస్టర్స్ వైఎస్ షర్మిల, డాక్టర్ నర్రెడ్డి సునీతలు ఏకధాటిగా సంధిస్తున్న ప్రశ్నలు జగన్‌కు ఊపిరి సలపనివ్వడం లేదు. ఆయనకు వారు పక్కలో బల్లెంలా…కాదు..కాదు…గొడ్డలిలా మారారు. ఇన్నాళ్లూ ఎదురేలేదనుకున్న జిల్లాలో ముచ్చెమటలు పట్టిస్తున్నారు. వైఎస్ వివేకా హత్య కేసును ఆయుధంగా మలుచుకుని జగన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. రోజుకో అంశాన్ని ఎత్తుకుని మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ, ప్రచారం చేస్తూ ఊరూరా, ఇల్లిల్లూ తిరుగుతూ వణుకు పుట్టిస్తున్నారు. 1996 ఎన్నికల్లో వైఎస్ ఎలాగైతే బోటాబొటీ మెజారిటీతో బయటపడ్డారో…ఇప్పుడూ అలాంటి పరిస్థితిని అవినాష్‌రెడ్డికి వారు తీసుకొస్తున్నారు. ఈ అక్కచెల్ళెళ్లు లెవనేత్తే ప్రశ్నలకు సమాధానాలు చెప్పే వారే లేరు. వైఎస్ అవినాష్‌రెడ్డి అడపాదడపా మాట్లాడుతున్నా…వాటిని ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. చివరికి జగనే రంగంలోకి దిగి పులివెందుల నడిబొడ్డున వైఎస్ అవినాష్‌రెడ్డి ‘చిన్న పిల్లాడు’ అంటూ వెనుకేసుకొచ్చారు. అయినా ఆ మాటలూ పనిచేయడం లేదు. వైఎస్సార్ జిల్లాలో ఏ ఊరు, ఏ వీధిలోకి వెళ్లి ఏ గడపను అడిగినా వివేకాపై గొడ్డలి వేటు వేసింది ఎవరంటే కథలు కథలుగా చెబుతారు. పులివెందుల పూలంగళ్ల వద్దకు వెళ్లి చిన్న పిల్లాడిని అడిగినా చెప్పేస్తారు. ‘వివేకాను చంపింది ఎవరో వైఎస్సార్ జిల్లాలో గడప గడపకూ తెలుసు. ఎవర్ని అడిగినా తడబాటు లేకుండానే సమాధానం చెబుతారు. ఇక్కడ అదంతా బహిరంగ రహస్యమే’ అని బద్వేలుకు చెందిన ఓ వైకాపా నాయకుడు చెప్పడమే దీనికి నిదర్శనం…పోటీలో బలంగా నిలబడిన షర్మిల1